అమరావతి : అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది. అభం శుభం తెలియని పసికందును కన్న తల్లి దారుణంగా చంపి ఆమె ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని గార్లదిన్నె మండలం కల్లూరులో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
కుటుంబ కలహాలతో మూడు నెలల పసికందును చంపి ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని బంధువులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు