(Anandaiah) నెల్లూరు: కరోనా మందు విషయమై ఏపీ హైకోర్టు తలుపులు తట్టాడు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య. కొవిడ్ వ్యాప్తి నివారణకు ఆయుర్వేద మందు తయారీ, పంపిణీకి అనుమతించాలని పిటిషన్ దాఖలు చేశారు. కొవిడ్ మందును పంపిణీ చేయకుండా ఆనందయ్య నివసించే కృష్ణపట్నం గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. ఇదే సమయంలో ఈ మందు తయారీ, పంపిణీకి ఎలాంటి అనుమతులు ఉన్నాయో వెల్లడించాలంటూ నెల్లూరు జిల్లా యంత్రాంగం నోటీసులు జారీ చేసింది.
ఆనందయ్య కరోనా మందును తయారు చేసి పంపిణీ చేస్తుండటంతో గ్రామంలో ఇబ్బందికరంగా తయారైందని, గ్రామస్థులకు కొవిడ్ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఎక్కువైందని కృష్ణపట్నం గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆనందయ్య మందును పంపిణీ చేయకుండా గ్రామస్థులు అడ్డుకున్నారు. ఆనందయ్య ప్రాణాలకు ముప్పు ఏర్పడినందున అతడి కార్యకలాపాలకు మద్దతు ఇవ్వకూడదని స్థానిక గ్రామ పంచాయతీ కూడా తీర్మానించింది. దాంతో గ్రామంలో ఆనందయ్యకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఈ పరిస్థితుల నుంచి తనను కాపాడి ఆయుర్వేద మందు తయారీ, పంపిణీకి అనుమతించాలంటూ ఆనందయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇలాఉండగా, ఆయుర్వేద మందు తయారీ, ఉత్పత్తికి ఎలాంటి అనుమతులు ఉన్నాయో వెల్లడించాలని నెల్లూరు జిల్లా యంత్రాంగం ఆనందయ్యకు నోటీసులు జారీ చేసింది. చెల్లుబాటయ్యే ఆమోదం లేకుండా కార్యకలాపాలు కొనసాగిస్తే ఆయుష్, డ్రగ్ అండ్ కాస్మోటిక్ యాక్ట్ సెక్షన్ 33 ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులో హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కృష్ణపట్నం గ్రామస్థులు మందు తయారీ, పంపిణీని అడ్డుకోవడంపై హైకోర్టులో పిటిషన్ వేశారు. సింగిల్ జడ్జి బెంచ్ ఈ పిటిషన్ను విచారణకు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనానికి బదిలీ చేసింది.
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..