Minister Anitha | ఏపీలో పోలీసువ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం : హోం మంత్రి అనిత
Minister Anitha | ఏపీలో శాంతి భద్రతల పర్యవేక్షణకు గాను పోలీసు వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.
అమరావతి : ఏపీలో శాంతి భద్రతల పర్యవేక్షణకు గాను పోలీసు వ్యవస్థ(Police Department) ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత (Minister Anitha ) వెల్లడించారు. ముఖ్యంగా పోలీస్స్టేషన్ల ఆధునికీకరణ, సౌకర్యాల మెరుగు తదితర అంశాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు.
బుధవారం హోంశాఖపై చంద్రబాబు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో మంత్రి అనితతో పాటు డీజీపీ ద్వారకా తిరుమలరావు(DGP Tirumala Rao), తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను హోంమంత్రి మీడియాకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలోని పోలీస్‌స్టేషన్‌లో ప్రతి పోలీసు స్టేషన్‌కు ఆరు సీసీ కెమెరాల ఏర్పాటు చేయనున్నామని వివరించారు. ప్రస్తుతం 15 వేల సీసీ కెమెరాలుండగా వీటిలో మరమ్మతుకు గురైనవి ఉన్నాయని తెలిపారు.
సీసీ కెమెరాలు, ఇతర ఫింగర్‌ప్రింట్స్, తదితర యంత్రాల నిర్వహణకుగాను పెండింగ్‌లో ఉన్న రూ.11 కోట్లను విడుదలకు సీఎం అంగీకరించారని పేర్కొన్నారు. అదేవిధంగా పోలీసు శాఖలో కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు అనుమతించారని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి సాగు, రవాణాను పూర్తిగా అరికట్టేందుకు టాస్క్ఫోర్సులను ఏర్పాటు చేశామని తెలిపారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మహిళల భద్రత గురించి వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

