అల్లు అర్జున్ అరెస్టును వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ ఖండించారు. తొకిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరూ తీర్చలేనిదని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ ఘటనపై అల్లు అర్జున్ విచారాన్ని వ్యక్తంచేసి, ఆమె కుటుంబానికి అండగా ఉంటానని బాధ్యతాయుతంగా వ్యవహరించారని గుర్తుచేశారు. ఘటనకు నేరుగా అతడిని బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి హస్తం ఉన్నదని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పుషరాలకు, కందుకూరుకు వెళ్లినప్పుడు తొకిసలాటలో ఎంతో మంది చనిపోయారని గుర్తుచేశారు. ఈ లెకన చంద్రబాబు నాయుడిని పోలీసులు ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలని, ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.