అమరావతి : రాష్ట్రాన్ని వైసీపీ నుంచి విముక్తి , రాష్ట్ర భవిష్యత్తు కోసం అంతా రాజీపడ్డామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) వెల్లడించారు. బుధవారం విజయవాడలోని ఉండవల్లి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కలలకు రెక్కలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, జనసేనలతో పొత్తులు(Alliances) సమాజ హితం కోసమే తప్ప స్వార్థం కోసం కాదు. కలిసి నూతన ఒరవడి సృష్టించాలనే పొత్తు పెట్టుకున్నాం. ప్రజలకు మేలు జరగాలంటే అధికార మార్పు అవసరమని ఆయన అన్నారు.
ప్రజల కోసమే రాజ్యాధికారం తప్ప. మా కోసం కాదని, ప్రజలు గెలవాలంటే వైసీపీ(YCP) ఓడితీరాలని పేర్కొన్నారు. యువత (Youth) భవిష్యత్ అంధకారం కావద్దునుకుంటే ఆలోచించాలని సూచించారు. ప్రజల్లో చైతన్యం రానంతవరకు భవిష్యత్ అంధకారంలోకి పోతుందని తెలిపారు. వైసీపీ విముక్త ఏపీ ఏర్పడాలనే లక్ష్యం కోసం పవన్ (Pawan) నిలబడ్డారని కొనియాడారు. వైఎస్ జగన్ విధ్వంసం వల్ల రాష్ట్రంలో ఏ వ్యవస్థా సక్రమంగా లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్రంలో బీజేపీ పదేళ్లు అధికారంలో ఉందని, రాబోయే రోజుల్లో మళ్లీ బీజేపీకే అవకాశం ఉన్నాయని, రాష్ట్రాభివృద్ధి జరగాలంటే కేంద్ర సహకారం ఎంతో అవసరమని అన్నారు. ప్రధాని చెబుతున్న 2047 భారత్ వికాసిత్ జరిగి తీరుతుందని ధీమాను వ్యక్తం చేశారు. ఎప్పుడు లేనంత తక్కువగా సీట్లు తీసుకున్నారని జనసేన, బీజేపీ నాయకులను రెచ్చగొట్టి విధ్వంసానికి యత్నిస్తున్నారని మండిపడ్డారు. నేను కూడా ఎలాంటి భేషాజాలకు పోకుండా కుల, మతాలకు అతీతంగా ఏకైక రాష్ట్రపునర్నిర్మాణం కోసం కట్టుబడి రాబోయే ఎన్నికలు పనిచేస్తామని అన్నారు.