అమరావతి : ఏపీ ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తులు(Alliances ) ఖరారయ్యాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు (Chandrababu) పార్టీ నాయకులకు వెల్లడించారు. శనివారం ఢిల్లీలో పొత్తుల అంగీకారం అనంతరం పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో టెలీకాన్ఫరెన్స్(Teleconference) నిర్వహించారు. పొత్తులు ఎందుకు చేసుకున్నామనే అంశంపై పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు.
ఏపీ ప్రజల భవిష్యత్ కోసమే పొత్తులు చేసుకున్నామని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి కేంద్ర సహకారం ఎంతో అవసరమని మరోసారి స్పష్టం చేశారు. గడిచిన ఐదేళ్లలో సీఎం జగన్ రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆరోపించారు. ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రం కోలుకోవాలంటే కేంద్రంతో కలసి ఉండాలని పేర్కొన్నారు.
ఈ రోజు బీజేపీతో కుదిరిన పొత్తులపై టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రకటన వస్తుందని ఆయన వెల్లడించారు. పొత్తులో భాగంగా ఎవరికైనా సీటు రాకుంటే నిరుత్సాహం చెందవద్దని సూచించారు. సీనియర్లు బాధ్యత తీసుకుని పొత్తు అవసరాన్ని వివరించాలని ఆదేశించారు.