అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను బట్టి పొత్తులుంటాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరం బట్టి ఇరుపక్షాల సమ్మతం మేరకు పొత్తులు జరుగుతాయని పేర్కొన్నారు. తన రెండో రోజు కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతున్న పర్యటనలో భాగంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. చరిత్ర గురించి వైసీపీకి తెలియదని విమర్శించారు.
ఒక్క ఛాన్స్ అంటు ప్రచారం చేశారు. గెలుపొందారు. రాష్ట్రాన్ని నాశానం చేశారు. వైసీపీ నేతలకు ప్రజలు త్వరలో తగిన బుద్ధి చెబుతారని, అదే వారికి లాస్ట్ ఛాన్సని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. పొత్తులు పెట్టుకున్నప్పుడు గెలిచాం.. ఓటమి పాలయ్యాం. చరిత్ర గురించి వైసీపీ నేతలకు ఏమి తెలుసని అన్నారు.