అమరావతి : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Modi) తెలిపారు. బుధవారం చంద్రబాబు నాయుడు(Chandra Babu), మంత్రులు ప్రమాణస్వీకారానికి (Swearing-in ceremony ) హాజరైన అనంతరం ఎక్స్(X tweet) ట్వీట్ ద్వారా మోదీ స్పందించారు.
ఏపీలో నూతన ప్రభుత్వ ఏర్పాటు, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యా. సీఎంతో పాటు ప్రమాణం చేసిన మంత్రులందరికీ అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. టీడీపీ(TDP) , జనసేన(Janasena) , బీజేపీ(BJP) కూటమి ఏపీ కీర్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యాను. ముఖ్యమంత్రి అయిన సందర్భంగా శ్రీ @ncbn గారికి, మరియు ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ కూడా అభినందనలు. ఎపిని నూతన కీర్తి శిఖరాలకు తీసుకెళ్లడానికి మరియు రాష్ట్ర యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి @JaiTDP,… pic.twitter.com/oVgnhlqw0u
— Narendra Modi (@narendramodi) June 12, 2024
విజయవాడలోని కేసరవల్లి ప్రాంతంలో ఏర్పాటుచేసిన నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకరానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర మంత్రులు అమిత్షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, చిరాగ్ పాశ్వాన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ప్రముఖ నటులు చిరంజీవి, రజినీకాంత్, రామ్చరణ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, నందమూరి, నారా, పవన్ కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు.