తిరుమల : సృష్ఠిలోని సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలో 16 రోజుల పాటు నిర్వహించిన షోడశదినాత్మక అరణ్యకాండ పారాయణ దీక్ష ఆదివారం మహా పూర్ణాహుతితో ముగిసింది. ఈ మహాపూర్ణాహుతి కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని ఆధ్వర్యంలో వసంత మండపంలో అరణ్యకాండ పారాయణంలోని శ్లోకాల పారాయణం, ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో జప-తర్పణ-హోమాలు నిర్వహించారు.
ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ లోక సంక్షేమం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ 16 రోజుల పాటు షోడశదినాత్మక అరణ్యకాండ పారాయణ దీక్ష నిర్వహించినట్లు తెలిపారు. వాల్మీకి మహర్షి సుందరకాండ. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండలుగా రామాయణాన్ని రచించారన్నారు. ఇప్పటికే సుందరకాండ. బాలకాండ, అయోధ్యకాండ, యుద్ధకాండ, అరణ్యకాండలను పారాయణం చేశామన్నారు.