అమరావతి : విద్యార్థులను ప్రోత్సహించేందుకు గాను నియోజకవర్గంలో అత్యుత్తమ మార్కులు సాధించిన 39 మంది విద్యార్థులకు విమానంలో విహారయాత్రను ( Air Tour ) నిజం చేయనున్నారు. మరి కొద్ది గంటల్లో వారు విమానంలో ఢిల్లీ ( Delhi ) కి బయలు దేరి మూడు రోజుల పాటు విహారం చేయనున్నారు.
ఏపీలోని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవి ( MLA Madhavi ) నియోజకవర్గంలోని ఎనిమిది మున్సిపల్ పాఠశాలల్లో 550 పైగా మార్కులు సాధించిన విద్యార్ధులకు విమానంలో విహార యాత్ర చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈమేరకు నియోజకవర్గంలో పదో తరగతి పరీక్షలు రాసిన వారిలో 39 మంది అత్యధిక మార్కులు సాధించారు. వారితో పాటు ఆయా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులతో కలిపి మొత్తం 52 మందిని గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విమానంలో విహార యాత్రకు అన్ని సిద్ధం చేశారు.
అంతే కాకుండా భారత ఉపరాష్ట్రపతితో విద్యార్ధులు కలిసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే మాధవి తెలిపారు. కేంద్ర మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు పెమ్మసాని చంద్రశేఖర్ విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు ఒక రోజు డిన్నర్ ఇవ్వనున్నారు.