అమరావతి : ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు సంబం ధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈరోజు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. గత నెల 3 న ఏపీ హైకోర్టు రాజధాని అమరావతి రైతుల భూములను నెలరోజుల్లో అభివృద్ధి చేపట్టి అందజేయాలని గడువు విధించింది. ఈ గడువు రేపటిలోగా ముగియనుండడంతో ముందు జాగ్రత్తగా ప్రభుత్వం 190 పేజీలతో కూడిన పలు అంశాలను ప్రస్తావిస్తూ అఫిడవిట్‌ను దాఖలు చేసింది.
రైతులకు అందించనున్న ప్లాట్లలో పనులు పూర్తి చేసి నెలరోజుల్లోగా నివేదిక ఇవ్వా లన్న హైకోర్టు ఆదేశంపై ప్రభుత్వం ఈ అఫిడవిట్లో ప్రధానంగా ప్రస్తావించింది. అమరావతిలో పనులు పూర్తి చేసే విషయంలో ప్రభుత్వం మరో నాలుగేళ్ల గడువు పొడిగించిందని సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. రైతుల ప్లాట్లు సహా ఇతరత్రా పనుల పూర్తికి తమకు 2024 జనవరి దాకా గడువు ఉందని ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు.