అమరావతి : ఏపీలో వివిధశాఖలకు పనిచేస్తున్న ఐఏఎస్ (IAS) అధికారులకు అదనపు బాధ్యతలు (Additional Responsibilities ) అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న యువరాజ్‌కు పరిశ్రమలశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ( Chief Secretary) నీరభ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
పౌరసరఫరాలశాఖ వీసీగా ఉన్న మన్జీర్ జిలానీకి మార్క్‌ఫెడ్ (Markfed) ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram) అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న రామసుందర్‌రెడ్డికి పరిహార పునరావాస కమిషనర్‌గా, ఆర్టీజీఎస్ సీఈవోగా దినేష్‌కుమార్‌కు ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.