Actor Samyuktha | తిరుమల వేంకటేశ్వరస్వామివారిని ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త బుధవారం దర్శించుకున్నారు. దయం నైవేద్య విరామం సమయంలో శ్రీవారిని దర్శించుకొని.. మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నటిని చూసిన పలువురు సంయుక్తతో సెల్ఫీ ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగిందని తెలిపింది. ఈ ఏడాది పలు సినిమాలు చేస్తున్నానని.. తనకు ఈ ఏడాది కీలకమని పేర్కొంది. వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడం తనకు సంప్రదాయమని చెప్పింది.
అలాగే, యువ హీరో ఆకాశ్ పూరీతో పాటు సింగర్ మంగ్లీ సైతం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. నటీనటులకు ఆలయ అధికారి దర్శనాలు చేయించి.. రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆకాశ్ పూరీ మాట్లాడుతూ ప్రస్తుతం తల్వార్ మూవీలో నటిస్తున్నట్లు చెప్పాడు. జనవరి నెలాకరు నుంచి సినిమా మొదలవుతుందని.. ఈ క్రమంలో స్వామివారి అనుగ్రహం కోసం వచ్చినట్లు చెప్పాడు. ఇదిలా ఉండగా.. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి. దాంతో భక్తుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు.