Jathwani Case : నటి (Actress) కాదంబరీ జెత్వానీ (Kadambari Jethwani) కేసులో ఐపీఎస్ అధికారి (IPS officer) విశాల్ గున్నీ (Vishal Gunni) కి హైకోర్టులో ఊరట లభించింది. అక్టోబర్ 1 వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. కాగా దర్యాప్తు పేరుతో తనను వేధించారని నటి జెత్వానీ.. ఐపీఎస్ గున్నీతో పాటు మరో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటాపై ఫిర్యాదు చేసింది. దాంతో వారు విచారణ ఎదుర్కొంటున్నారు.