కాకినాడ: కాకినాడ జిల్లా తునిలో (Tuni) బాలికపై అత్యాచారం కేసు నిందితుడు తాటిక నారాయణరావు ( Narayanarao) పరారయ్యాడు. బుధవారం అర్ధరాత్రి మేజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నది. నిందితుడు టీడీపీ నేత కావడం గమనార్హం.
జగన్నాథగిరిలోని ఏపీ గురుకుల బాలిక పాఠశాలలో (AP Grukula Student) చదవుతున్న బాలికపై (13) నారాయణరావు లైంగికదాడికి పాల్పడ్డాడు. గురుకుల పాఠశాలలో చదువుతున్న మనవరాలి వయసున్న బాలికకు తినుబండారాలు కొనిపెట్టి, మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. ఆమెకు తాను తాతనంటూ సిబ్బంది వద్ద నమ్మబలికాడు. బాలిక ఆరోగ్యం బాగాలేదని, ఇంజెక్షన్ వేయిస్తానంటూ మంగళవారం బయటకు తీసుకువెళ్లాడు. తుని హంసవరం శివారులోని నిర్మానుష్యంగా ఉన్న ఓ తోటలోకి బాలికను తీసుకెళ్లాడు. అఘాయిత్యానికి పాల్పడుతున్న సమాయంలో తోట కాపలాదారుడు గమనించి నిలదీయడంతో.. తాను కౌన్సిలర్‌ను అని, మాది వీరవరపుపేట అంటే దబాయించాడు. అయితే అతడు తన ఫోన్లో వీడియో తీస్తుండటంతో బాలికను గురుకుల స్కూల్లో వదిలేసి కొండవారపేట పారిపోయాడు. విషయం బాలిక కుటుంబసభ్యులు, స్థానికులు నారాయణరావుకు దేహశుద్ధి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో కోర్టుకు తరలిస్తుండగా చెరువులో దూకి గల్లంతయ్యాడు. వాష్‌రూమ్‌కు వెళ్తామంటే వాహనం ఆపామని, ఆ వెంటనే చెరువులో దూకేశాడని పోలీసులు చెప్పారు. నారాయణరావు కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టామన్నారు. అయితే నారాయణరావు పారిపోవాలని చూశాడా లేదా, అవమానంతో ఆత్మహత్యాయత్నం చేశాడా? తెలియాల్సి ఉంది.