శబరిమలకు వెళ్తున్న ఏపీ బస్సుకు ప్రమాదం .. 18 మంది అయ్యప్ప భక్తులకు గాయాలు
ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమలకు వెళ్తున్న యాత్రికుల బస్ ప్రమాదవాశాత్తు లోయలో పడి 18 మంది అయ్యప్ప భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమలకు వెళ్తున్న బస్ ప్రమాదవాశాత్తు లోయలో పడి 18 మంది అయ్యప్ప భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరుకు చెందిన 84 మంది అయ్యప్ప భక్తులు శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు రెండు టూరిస్టు బస్సుల్లో బయలు దేరారు. వీరు ప్రయాణిస్తున్న ఒక బస్సు కేరళలోని పతనంథిట్ట వద్ద లోయలో బోల్తా పడింది. బస్సు ఘాట్ రోడ్డు ఎక్కుతుండగా స్టీరింగ్ పట్టేయడంతో వెనక్కి వస్తూ బోల్తాపడిందని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు తెలిపారు.
ఏలూరు జిల్లా మాదేపల్లి ప్రాంతానికి చెందిన 18 మంది భక్తులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఘటన విషయాన్ని తెలుసుకున్న
ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి క్షతగాత్రులకు వైద్యం సహాయం నిమిత్తం కేరళ ప్రభుత్వం తో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు .
Kerala | A bus, carrying 44 Sabarimala pilgrims from Andhra, met with an accident near Laha in Pathanamthitta. All injured have been admitted to hospital. Three people, including an 8-yr-old boy, shifted to Kottayam Medical College hospital. Health min Veena George is at the spot pic.twitter.com/8HXeU91JDa
— ANI (@ANI) November 19, 2022
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

