తిరుమల : తిరుమల ఘాట్‌రోడ్డులో జరుగుతున్న వరుస ప్రమాదాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఘాట్‌రోడ్డులో పదిరోజుల్లో మూడు ప్రమాదాలు జరిగాయి. ఆదివారం తమిళనాడు(Tamilnadu)కు చెందిన భక్తులు(Devotees) స్వామివారిని దర్శించుకుని తిరుపతి(Tirupati)కి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న టెంపో వాహనం మొదటి ఘాట్‌రోడ్డులోని నాలుగో మలుపు వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది(Overturn).
దీంతో వాహనంలో ఉన్న కొందరికి తీవ్ర గాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద వార్తను తెలుసుకున్న ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది హుటాహుటినా బాధితులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గంటసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. క్రేన్ సహాయంతో బోల్తా పడ్డ టెంపోను పక్కకు తీసి పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.