జగద్గిరిగుట్ట : ఆల్విన్ కాలనీ డివిజన్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి విజయనగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. విజయనగర్ కాలనీ అను రెసిడెన్సీఅపార్ట్మెంట్లోని G -1 ఫ్లాట్లో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చేతులు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో ఒకరు మృతిచెందగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
అను రెసిడెన్సీ అపార్ట్మెంట్లోని G -1 ఫ్లాట్లో సతీష్ కుమార్, భార్య ఆమని, కుమారుడు నితీష్ కుమార్, కూతురు శ్రీజవళితో కలిసి ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో వీరంతా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. చేతులు కోసుకున్నారు. ఒకరు మృతి చెందగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.