అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మహిళలపై జరుగుతున్న దౌర్జన్య సంఘటనలు ఒకవైపు బాధిస్తుంటే మరోవైపు ఓ యువతి ధైర్యసాహసాలు ప్రదర్శించి తన వెంట పడుతున్న ఓ యువకుడిని నడిరోడ్డుపై చితకబాదింది. బెజవాడలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
గన్నవరం ఎయిర్పోర్టులో ఉద్యోగం చేసే యువతి నిన్న రాత్రి నడుచుకుంటు వెళ్తుండగా ఓ యువకుడు బైక్పై ఆమెను అనుసరించాడు. ఎందుకు వెంట పడుతున్నావని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిపై దాడి చేసి అక్కడే ఉన్న కర్రతో విపరీతంగా చితకబాదింది. పోకిరి భరతం పట్టిన యువతిని పలువురు ప్రశంసించారు.