అమరావతి : ఏపీలోని ప్రకాశం జిల్లాలో(Prakasam District) పోలీసులు కొట్టారనే మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. జిల్లాలోని పొన్నూరు మండలంలో రొయ్యల హ్యాచరీలో పనిచేస్తున్న పర్చూరు గ్రామానికి చెందిన రాజా ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హ్యాచరీలో డబ్బులు దొంగిలించాడని యజమాని ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. పీఎస్లో తనను పోలీసులు కొట్టారని యువకుడు మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు.