అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ను వరుస అల్పపీడనాలు ( Low pressures ) కలవరపెడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ నైరుతిగా పయనించి దక్షిణ కోస్తా తీరంవైపు వచ్చే క్రమంలో బలహీనపడుతుందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.
తీవ్ర అల్పపీడనం కారణంగా గత వారం రోజులుగా ముసురు నెలకొని ఉండడంతో ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడుతయాని తెలిపారు.
కాగా ప్రస్తుతమున్న అల్పపీడనం బలహీనపడుతున్న దశలో మరోటి ఏర్పడే అవకాశముందని వివరించారు. ఇటీవల కాలంలో బంగాళాఖాతంలో డిసెంబర్ నెలలో వరుస అల్పపీడనాలు ఏర్పడడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.