అమరావతి : అల్లూరి జిల్లాలో మావోయిస్టు దళ సభ్యురాలు జోగమ్మ అలియాస్ రితిక పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఎటపాక మండలం సాలిబుడపకు చెందిన పోడియం జోగమ్మ ఇవాళ ఓఎస్డీ కృష్ణకాంత్ ఎదుట లొంగిపోయారు. 2019లో దళ సభ్యురాలిగా చేరిన ఆమె 2021లో ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో పాల్గొందని ఓఎస్డీ వివరించారు.
ఈ ఘటనలో 22 మంది పోలీసులు, ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని ఆయన వెల్లడించారు. ఆమె లొంగిపోతే ప్రభుత్వం రూ. లక్ష రివార్డును ప్రకటించింది. ఈ రివార్డును అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని ఓఎస్డీ పేర్కొన్నారు.