అమరావతి : ఆగ్నేయ బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడడంతో ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ ప్రభావం అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department) ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. బలపడిన అల్పపీడనం గురువారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, డిసెంబర్ 2 కల్లా తుఫాన్‌గా మారి నాలుగురోజుల పాటు వర్షాలు (Heavy Rains) పడుతాయని వెల్లడించారు.
తుఫాన్ ప్రభావం వల్ల కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని పేర్కొన్నారు. మొదటి రెండు రోజులు దక్షిణ కోస్తా లోని నెల్లూరు(Nellore) , రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు, నెల్లూరు, చిత్తూరు , తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అన్నారు.
ప్రకాశం, వైఎస్సార్ జిల్లా, అన్నమయ్య జిల్లాల్లోనూ వర్షాల ప్రభావం ఉంటుందని తెలిపారు. రానున్న తుఫాను వల్ల రైతులు, మత్స్యకారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెండో తేదీ నుంచి సముద్రంలో వేటకు వెళ్లరాదని తెలిపారు.