అమరావతి: హెచ్ఆర్ఏ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. విజయవాడ పరిసరాల్లో ఉన్న హెచ్ఓడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) పెంచుతూ జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటనీ రావత్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో హెచ్ఓడీ ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్ఆర్ఏను 8 నుంచి 16 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఆర్ఏను గతంలో తగ్గించిన ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. విభజన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన సెక్రటేరియట్ ఉద్యోగులతో పాటు హెచ్ఓడీ కార్యాలయాల్లో పనిచేసే వారికే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. గతంలో వీరికి 30 శాతం హెచ్ఆర్ఏ వచ్చేది. ఈ మొత్తాన్నిప్రభుత్వం 8 శాతానికి తగ్గించింది. దీనిపై పునరాలోచించిన ప్రభుత్వం ప్రస్తుతం 16 శాతానికి జగన్ ప్రభుత్వం పెంచుతూ నిర్ణయించింది.