అమరావతి : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. అతివేగంగా వచ్చిన కారు లారీని ఢీ కొట్టడంతో చిన్నారితో సహా ముగ్గురు మృతి చెందారు. కృష్ణా (Krishna District) జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న పసికందుతో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.