హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళాన్ని అందజేసి తన భక్తిని చాటుకున్నాడు.
ఈ మేరకు మంగళవారం హైదరాబాద్కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులురెడ్డి రూ.30 లక్షల విలువైన 22 కేజీల వెండి గంగాళాన్ని శ్రీవారి ఆలయంలో టీటీడీ అధికారులకు ఈ కానుకను ఇచ్చాడు.