తిరుమల : ఆపదమొక్కులవాడు తిరుమల (Tirumala ) వేంకటేశ్వరుడిపై ఉన్న నమ్మకంతో భక్తుల బలహీనతను ఆసరాగా చేసుకుని మోసం చేసిన కానిస్టేబుల్‌పై కేసు నమోదు అయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీవారి బ్రేక్ దర్శనాలు (Brake Darsan) కల్పిస్తానని ఐటీబీపీ కానిస్టేబుల్ చంద్రశేఖర్ (ITBP constable ) బెంగుళూరుకు చెందిన హరిబాబు, చంద్రశేఖర్‌ను బురిడీ కొట్టించాడు.
అనంతపురం ఎమ్మెల్సీ శివరామిరెడ్డి సిఫార్సులేఖపై ఆరు టికెట్లకు గాను రూ.50 వేలు, అరకు ఎమ్మెల్యే మచ్చలింగం సిఫార్సు లేఖపై 20 వేలను కానిస్టేబుల్ వసూలు చేశాడు. అయితే బ్రేక్ దర్శనం కాకుండా రూ. 300 టికెట్ దర్శనం కల్పించడంతో మోసపోయామని గ్రహించిన భక్తులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తిరుమల పోలీసులు ఐటీబీపీ కానిస్టేబుల్ చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.