సుల్తాన్‌బజార్, జనవరి 13: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిపై కేసు నమోదైంది. బేగంబజార్ సీఐ నమిండ్ల శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కారణమని నారాయణస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు 504,505 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సీఐ వివరించారు.