Kodali Nani | మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని లా విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదుతో వైజాగ్ మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు అధికార కార్యక్రమంలో చంద్రబాబుపై అసభ్యకరమైన భాష మాట్లాడారని ఏయూ లా విద్యార్థిని అంజనీప్రియ శనివారం త్రిటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ మహిళగా కొడాలి నాని తిట్లు భరించలేకపోయానని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై సీఐ రమణయ్య కేసు నమోదు చేశారు.