Big Shock | ఏపీలో ఎన్నికల విధుల నుంచి వాలంటీర్ల తొలగింపు
Big Shock | ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ (YCP) కి గట్టి షాక్ తగిలింది. వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశాలు వెలువడ్డాయి.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి (CS Jawahar reddy) నుంచి ఉత్తర్వులు అందాయి. ఎన్నికల(Elections) ప్రక్రియలో పాల్గొంటే ఈసీ మార్గదర్శకాల ఉల్లంఘనేనని ఆయన పేర్కొన్నారు.. పోలింగ్ ఏజెంట్లుగానూ వాలంటీర్లు ఉండరాదని, ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి ప్రక్రియలోనూ వాలంటీర్లు పాల్గొనకూడదని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి.
2019లో ఏపీలో వైసీపీ జగన్(YS Jagan) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. రాష్ట్రంలోని 2 .48 వేల మందిని వాలంటీర్లుగా నియమించి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. పనిలో పనిగా అనధికారికంగా పార్టీ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుండడంతో ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఓటరు జాబితాలో వాలంటీర్లు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఎన్నికల సంఘానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదు అందడంతో వాటిని పరిశీలించిన అధికారులు వాలంటీర్లకు ఎన్నికల బాధ్యతలు అప్పగించవద్దని ఉత్తర్వులు వెలువడింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

