తిరుమల : తిరుమల(TTD) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 13 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం(Sarvadarshanam ) కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 75,109 మంది భక్తులు దర్శించుకోగా 30,285 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.40 ఆదాయం(Income) వచ్చిందని వివరించారు.
నూతన సీవీఅండ్ఎస్వోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్
తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ నూతన చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (CVSO) గా ఎస్ శ్రీధర్ (ఐపీఎస్ )బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. కొత్త సీవీఅండ్ఎస్వోకు రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అధికారులు శ్రీవారి ఫోటోతో పాటు తీర్థ ప్రసాదాలను అందించారు.