Current | మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు అవుతున్నా.. ఇంకా కరెంటు లేని గ్రామం ఉందని అంటే నమ్ముతారా? అది కూడా ఏ ఛత్తీస్గఢ్లోనో.. నార్త్ ఇండియాలోనో కాదు.. మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనే అని తెలుసా! అంటే స్వాతంత్య్రం వచ్చిన 77 ఏండ్ల తర్వాత అనకాపల్లి జిల్లా రోలుగుంట(మ) అర్ల పంచాయతీలోని నీలబంద గ్రామాన్ని తాజాగా విద్యుతు వెలుగులు తాకాయి.
భారతదేశానికి 1947లోనే స్వాతంత్య్రం వచ్చినప్పటికీ.. అనకాపల్లి జిల్లాలోని నీలబంద గ్రామం మాత్రం 2025 దాకా అంధకారంలోనే ఉండిపోయింది. ఇక్కడి ప్రజలు చీకట్లోనే జీవనం సాగించారు. ఎట్టకేలకు దాదాపు 77 ఏండ్ల తర్వాత ఈ గ్రామానికి తాజాగా విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఇప్పటికే కరెంటు పోల్స్ వేసి, వైర్లు లాగిన విద్యుత్ అధికారులు తాజాగా విద్యుత్ సరఫరా చేశారు. దీంతో ఆ ఊరిలో ఆదివారం నాడు తొలిసారిగా లైట్లు వెలిగాయి. దీంతో ఆ గ్రామ ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. థింసా నృత్యం చేస్తూ తమ హర్షం వ్యక్తం చేశారు. నీలబంద గ్రామంలో ప్రస్తుతం మూడు కుటుంబాలు ఉంటున్నాయి. ఈ కుటుంబాల్లో మొత్తం 26 మంది ప్రజలు ఉన్నారు.
స్వాతంత్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత గిరిజన గ్రామంలో తొలిసారి వెలిగిన లైట్లు
అనకాపల్లి జిల్లా రోలుగుంట (మ) అర్ల పంచాయతీ లోని నీలబంద గ్రామంలో 3 కుటుంబాలు, 26 మంది ఉంటున్నారు
ఈ గ్రామంలో స్వాతంత్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత విద్యుత్ సౌకర్యం రావడం, మొదటి లైట్ వెలగడంతో గ్రామ ప్రజలు ఆనందంతో,… pic.twitter.com/UwNVuvR7Ge
— Telugu Scribe (@TeluguScribe) February 3, 2025