సాధారణంగా అరటి గెలలు ఎంత పొడవు ఉంటాయో తెలుసు కదా. రెండు మూడు ఫీట్ల కంటే అరటి గెలలు ఎక్కువ ఉండవు. ఒక్క గెలకు 40 నుంచి 50 అరటి పండ్ల కంటే ఎక్కువ ఉండవు. కానీ.. ఇటువంటి అరటి గెలను మాత్రం జన్మలో చూసి ఉండరు. ఎందుకో తెలుసా. ఈ అరటి గెల ఏకంగా 7 ఫీట్ల పొడవు ఉంటుంది.
అంటే.. మనిషి కంటే ఎక్కువ పొడవు ఉంటుందన్నమాట. ఈ అరటి గెల ఎక్కడ కాసిందో తెలుసా? ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలోని వాకటిప్పా అనే గ్రామంలో. అనాల సుదర్శన్ అనే వ్యక్తి ఇంట్లో అరుదైన అరటి చెట్టు ఉంది. ఆ చెట్టును బెంగళూరులో ఉండే తన కూతురు దగ్గర్నుంచి తీసుకొచ్చి తన ఇంట్లో నాటాడు. ఆ చెట్టు పెరిగాక.. సాధారణ అరటి గెలలు కాకుండా.. పొడవైన గెలలు వేయడం ప్రారంభించింది. ఒక్క గెల కనీసం 60 కిలోలు ఉంటుందట. ఒక్క గెలకు కనీసం 140 అరటి పండ్లు కాస్తాయట.
దీంతో ఈ అరటి గెలకు బాహుబలి బనానా అని పేరు పెట్టారు. ఇక.. వెరైటీ అరటి చెట్టు.. అరటి గెలను చూసేందుకు స్థానికులు సుదర్శన్ ఇంటికి క్యూ కడుతున్నారు. 7 ఫీట్ల పొడవు ఉన్న బాహుబలి అరటి గెలల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.