Nandigam Suresh | బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు పోలీస్ కస్టడీ విధిస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన మరియమ్మ అనే మహిళ హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేశ్‌ను 48 గంటల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది.
శనివారం ఉదయం 11.30 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు నందిగం సురేశ్‌ను కస్టడీలోకి తీసుకుని తుళ్లూరు పోలీసులు విచారించనున్నారు. న్యాయవాది సమక్షంలోనే ఈ విచారణ కొనసాగాలని మంగళగిరి కోర్టు ఆదేశించింది.
2020 డిసెంబర్లో వెలగపూడిలో రెండు సామాజిక వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ అల్లర్లలో ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. మహిళ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అప్పట్లో తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ 78వ నిందితుడిగా ఉన్నారు.