భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆహ్వానించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్, ఇతర సభ్యులు మంగళవారం క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. శత జయంతి ఉత్సవాల వివరాలు తెలియజేశారు.
నవంబర్ 19వ తేదీన ఈ శత జయంతి ఉత్సవాలకు ప్రధాని మోదీ హాజరుకానున్నారని, ఆయనతో కలిసి వేడుకలకు హాజరవుతానని సత్యసాయి ట్రస్ట్ బోర్డు సభ్యులకు పవన్ కళ్యాణ్ తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నియోజకవర్గవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించినట్టు చెప్పారు. శ్రీ సత్యసాయి మందిరానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.30 కోట్లు అదనంగా కేటాయించినట్టు చెప్పారు.
శత జయంతి ఉత్సవాలలోపు మందిరానికి అనుసంధాన రహదారులను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. రోడ్ల నిర్మాణానికి రూ. 30 కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించినందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సత్యసాయి ట్రస్ట్ బోర్డు చైర్మన్ రత్నాకర్ ధన్యవాదాలు తెలిపారు.
శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలకు ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారికి ఆహ్వానం.
ఆహ్వాన పత్రికను మేనేజింగ్ ట్రస్టీ శ్రీ రత్నాకర్ గారు అందజేశారు.గౌరవ ప్రధానమంత్రి @narendramodi గారితో కలిసి వేడుకల్లో పాల్గొంటానని శ్రీ @PawanKalyan గారు తెలిపారు.
పుట్టపర్తి రోడ్ల అభివృద్ధికి… pic.twitter.com/InXLoqZPWq
— JanaSena Party (@JanaSenaParty) October 28, 2025