తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న 66,020 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 29,195 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.37 కోట్లు వచ్చిందని తెలిపారు.
7న టీటీడీ విద్యా సంస్థల్లో స్పాట్ అడ్మిషన్లు
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ , పీజీ కళాశాల, గోవింద రాజస్వామి ఆర్ట్స్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య (ఓరియంటల్ ) కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో చేరదలచిన విద్యార్థులకు డిసెంబరు 7వ తేదీ స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు.
ఆసక్తి గల విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలన్నారు. స్పాట్ అడ్మిషన్ పొందిన విద్యార్థులకు హాస్టల్ వసతి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన వర్తించవని వివరించారు.