తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచియున్నారు. వీరికి 18 గంటల్లో సర్వదర్శనం లభిస్తుందని అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 63,253 మంది భక్తులు దర్శించుకోగా 24,490 మంది తలనీలాలు సమర్పించికున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.16 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.
వైకుంఠ ఏకాదశి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ
అనంతపురం రేంజి డీఐజీ రవిప్రకాష్ పోలీసు అధికారులు, టీటీడీ నిఘా, భద్రత అధికారులు వైకుంఠ ఏకాదశి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నారాయణగిరి ఉద్యానవనాల్లోని క్యూలైన్లు, కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద క్యూలైన్లు తదితర ఏర్పాట్లను పరిశీలించారు.
వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. వాహనాల పార్కింగ్ కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.