AP News | చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగాధర నెల్లూరు పరిధిలోని శ్రీరంగరాజపురం మండలంలోని బీసీ కాలనీ సమీపంలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిలో ఓ విద్యార్థి నాలుక తెగిపోయింది.
భానోదయ పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను ఎక్కించుకుని వెళ్తుండగా.. బీసీ కాలనీ సమీపంలో ఎదురుగా అతి వేగంతో దూసుకొచ్చిన ఒక కంటైనర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కంటైనర్ ఢీకొనడంతో బస్సులో ఉన్న విద్యార్థులు భయాందోళనలతో కేకలు వేశారు. ఆ అరుపులు విన్న స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో సుమారు 16 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి నాలుక తెగిపడింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను శ్రీరంగరాజపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
ఈ ప్రమాదంతో చిత్తూరు- పుత్తూరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో మితిమీరిన వేగంగా రావడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. అలాగే స్కూల్ బస్సు ఫిట్నెస్, డ్రైవర్ పరంగా లోపాలు ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
స్కూలు బస్సును ఢీకొట్టిన లారీ
ఏడుగురు విద్యార్థులకు గాయాలు, తెగిపోయిన ఒక విద్యార్థి నాలుక
చిత్తూరు జిల్లా SR పురం సమీపంలోని కొన్ని గ్రామాల నుండి విద్యార్థులను ఎక్కించుకుని, జీడీనెల్లూరు వైపు వెళ్తుండగా, బీసీ కాలనీ వద్ద స్కూలు బస్సును వెనుక… pic.twitter.com/km60gEG1H8
— Telugu Scribe (@TeluguScribe) January 30, 2026