అమరావతి : బాపట్ల జిల్లా పర్చూరు మండలం చిన్న నందిపాడులో 16 మంది వ్యవసాయ కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చిలకలూరిపేట మండలం దండమూడి గ్రామానికి చెందిన కూలీలు గురువారం పొలం పనుల నిమిత్తం చిన్న నందిపాడుకు వచ్చారు. పంట పొలంలో పురుగు మందులు చల్లిన కూలీలతో సహ పక్కనే పనిచేస్తున్న మరికొందరు కూలీలు ఒక్కసారిగా అస్వస్థతకు లోనయ్యారు.
దీంతో స్థానికులు వారిని హుటాహుటినా గుంటూరు జిల్లా పెద్ద నందిపాడు ఆస్పత్రిలో చేర్పించారు. వారిని పరీక్షించిన వైద్యులు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందజేస్తున్నారు.