నెల్లూరు : నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి భారీ ప్రమాదం సంభవించింది. సంగం వద్ద వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో స్థానికంగా ఉన్న వాగులో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 12 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వాగులో కొట్టుకుపోతున్న ప్రయాణికులను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. చీకటి ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. అయితే వాగులో నుంచి ఏడుగురిని స్థానికులు కాపాడారు. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు.