అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 18,777 మంది నుంచి నమూనాలు పరీక్షించగా 127 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందని వైధ్యాదికారులు సోమవారం హెల్త్ బులిటిన్‌లో వెల్లడించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన ఇద్దరు వైరస్ బారిన పడి మృతి చెందారని , ప్రస్తుతం రాష్ట్రంలో 2,206 యాక్టివ్ కేసులు ఉన్నాయని వారు పేర్కొన్నారు.
184 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారని వివరించారు. చిత్తూరు, ఈస్ట్‌గోదావరి, వెస్ట్‌గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, విశాఖ పట్నం జిల్లాలో కేసులు అధికంగా నమోదయ్యాయని అధికారులు పేర్కొన్నారు.