తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ వేంకటేశ్వర స్వామి ( Venkateshwar Swamy) ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు 16 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 59,621 మంది భక్తులు దర్శించుకోగా 28,351 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.45 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.
టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం
పూణేకు చెందిన బిగాస్ ఆటోమొబైల్స్ ఎండి హేమంత్ కాంద్రా, ఉపాధ్యక్షుడు సతీ శెట్టితో కలిసి శనివారం టీటీడీకి రూ. 1.50 లక్షల విలువైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని(Two wheeler) విరాళంగా అందజేశారు. శ్రీవారి ఆలయం ఎదుట పూజలు నిర్వహించి ద్విచక్రవాహనం తాళాలను టీటీడీ రిసెప్షన్ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్కు అందజేశారు.ఈ కార్యక్రమంలో తిరుమల డీఐ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.