IAS Transfers | ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అన్ని శాఖల్లో ప్రక్షాళన మొదలుపెట్టింది. ఇందులో భాగంగా వివిధ స్థాయిల్లో కొనసాగుతున్న ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ వస్తుంది. తాజాగా మరో 11 మంది ఐఏఎస్ అధికారులతో పాటు ఒక ఐఎఫ్ఎస్ అధికారిని బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
☞ ప్రణాళిక సంఘం జాయింట్ సెక్రటరీగా అనంత్ శంకర్
☞ స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా పీఎస్ గిరీషా
☞ కర్నూలు జాయింట్ కలెక్టర్‌గా నవ్య
☞ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఎస్. భార్గవి
☞ ఫైబర్‌నెట్ ఎండీగా కొత్తమాసు దినేశ్‌కుమార్
☞ ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్ ఎండీగా దినేశ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు
☞ ఏపీ ఎయిర్‌పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య
☞ అనంతపురం జాయింట్ కలెక్టర్‌గా డి.హరిత
☞ తూర్పుగోదావరి జాయింట్ కలెక్టర్‌గా ఎస్.చిన్నరాముడు
☞ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పి.శ్రీనివాసులు
☞ పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా తాటిమాకుల రాహుల్‌కుమార్ రెడ్డి
☞ విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా సేదు మాధవన్
☞ నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా కొల్లాబత్తుల కార్తీక్