Prawns cultivation | రొయ్యలను చాలామంది ఇష్టంగా తింటూంటారు. రొయ్యలతో కూర వండుకోవడమే కాకుండా ప్రై, బిర్యానీ.. ఇలా చాలా వంటకాలు తయారు చేస్తారు. చాలా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్నిస్తాయి. రొయ్యల పెంపకంతో అధిక ఆదాయం సంపాదించవచ్చునంటున్నారు నిపుణులు. చాలా ప్రాంతాల్లో కృత్రిమ చెరువులు తవ్వి రొయ్యలను పెంచుతూ లాభాలను గడిస్తున్నారు. ఈ నేపథ్యంలో రొయ్యల పెంపకం ఎలా చేపట్టాలి..? అధిక ఆదాయం రావాలంటే ఏం చేయాలి..? అనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
చెరువుల నాణ్యత
రొయ్యల పెంపకంలో చెరువుల నాణ్యత చాలా ప్రాధాన్యం ఉంటుంది. చెరువు మురుగునీరు, ఇన్లెట్తో ఉండాలి. పెంచుకోవాలనుకున్న రొయ్యలు నాణ్యత ఉండేలా చూసుకోవాలి. రొయ్యలు తినడానికి ఆల్గే, క్రిమి లార్వా అందిస్తుండాలి. కొత్తగా తవ్విన చెరువులతో తొలి సంవత్సరం అధిక ఆదాయం రాదు. అంతమాత్రానా నిరుత్సాహానికి గురవ్వొద్దు. చెరువు నీళ్లు రసాయనాలు, హానికరమైన బ్యాక్టీరియా లేకుండా చూసుకోవాలి. చెరువులో చేపలు, ఇతర ఉభయచరాలు లేకుండా జాగ్రత్తపడాలి. నీటి పీహెచ్ బ్యాలెన్స్ 10 కంటే తక్కువగా ఉండేలా గమనించాలి. నీటిలో రోజంతా నడిచేలా ఎరేటర్ జోడించాలి.
ఈ ఆహారాలు ఇవ్వాలి..
రోజుకు రెండుసార్లు రొయ్యలకు తిండి వేయాలి. 38 శాతం ప్రొటీన్ కలిగిన గుళికలు, ఆల్గే, క్రిమి లార్వా, పాచిని రొయ్యలు తింటాయి. ఆహారం ఎంత ఎక్కువగా వేస్తే అంత బాగా రొయ్యలు వృద్ధిచెందుతాయి. చెరువు నీటిని ఎప్పటికప్పుడు మారుస్తుండాలి.
రొయ్యల రకాలు..
ప్రస్తుతం 300 జాతుల రొయ్యలు మార్కెట్లో ఉన్నాయి. పింక్, తెలుపు, గోధుమ, ఎరుపు రంగులుగా వీటిని వర్గీకరించారు. గులాబీ రంగుల జాతిని సీ ఫుడ్ కౌంటర్ వెనుక చూస్తారు. పచ్చిగా ఉన్నప్పుడు గులాబీ రంగులో ఉంటాయి. గులాబీ రంగులో ఎక్కువ రుచి ఉంటుంది. వాటిల్లో ఎక్కువ అయోడిన్ ఉంటుంది.