మల్లె తోటల్లో మొగ్గలు, పూత ఎక్కువ వచ్చేందుకు.. ఆకుల పెరుగుదలకు అడ్డుకట్ట వేయాలి. ఇందుకోసం నవంబర్ నెల నుంచే మొక్కలన్నీ ఆకులు రాల్చేలా ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించాలి. మొదటగా తోటలకు నీరు పెట్టడం నిలిపేయాలి. కొమ్మలన్నిటినీ దగ్గరికి చేర్చి.. తాడుతో గట్టిగా కట్టేయాలి. దీంతో ఆకులు తొందరగా రాలిపోతాయి. లీటర్ నీటిలో 3 గ్రా. పెంటాక్లోరోఫినాల్ లేదా పొటాషియం అయోడైడ్ను కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. దీనివల్ల ఆకులన్నీ రాలిపోతాయి. ఇలా ఆకుల పెరుగుదలను నిలిపేయడం వల్ల.. మల్లె తోటల్లో దిగుబడిని మరింతగా పెంచుకోవచ్చు.