హైదరాబాద్ : ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య మార్గదర్శకత్వంలో యోగ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. పీఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలను ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ప్రాతఃకాల సంగీతనాధ ధ్యానం తర్వాత పత్రీజీ వీడియో సందేశం ఇవ్వనున్నారు. ఉదయం 8.30 నుంచి ప్రముఖ యోగాచార్య శ్రీ వెంకటేశ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 వరకు ప్రముఖ ప్రకృతి వనం ప్రసాద్చే ప్రకృతి జీవనంతో ఆరోగ్యం అనే ఆంశం మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రముఖ యోగ గురువు జగన్ గురూజీచే యోగ, ఆయుర్వేదం, వ్యక్తిత్వ వికాసంపైన అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. సీనియరు పిరమిడ్ల మాస్టర్లచే సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు ఛైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ ఛైర్మన్ సుధీర్ షా, లక్ష్మీ, రాజేశ్వర్ పూలా, చంద్రశేఖర్ తెలిపారు. తదితర వివరాలకు సికింద్రాబాద్ ప్యారడైజ్ పరిధిలోని జులూరి వీరేశలింగం కల్యాణ మండపం, వెస్లీ స్కూల్ పక్కన సంప్రదించగలరు. మరిన్ని వివరాలకు 9949183110 / 9392474874 / 7075594555 అనే నంబర్లకు కాల్ చేయొచ్చు.