తాండూర్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి పోటీలకు( State level competitions) అచ్చలాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ( ZPHS students) ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు ఏ సాంబమూర్తి తెలిపారు.
మంగళవారం ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జోనల్ స్థాయి రెజ్లింగ్, కబడ్డీ సెలక్షన్లో అండర్-17 రెజ్లింగ్ బాలికల విభాగంలో సీహెచ్ హర్షిత (9వ తరగతి) గోల్డ్ మెడల్, అండర్-17 రెజ్లింగ్ బాలుర విభాగంలో ఆర్ హర్షిత్ (10వ తరగతి) గోల్డ్ మెడల్ సాధించారు. ఈ ఇద్దరు హైదరాబాద్ లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని వెల్లడించారు.
అండర్-17 కబడ్డీ బాలుర విభాగంలో ఏ రాజ్ కుమార్ (10వ తరగతి ) అత్యుత్తమ ప్రతిభకనబరిచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ళ బయ్యారంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని వివరించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల హెచ్ఎ పీ ఉమాదేవి, ఏఏపీసీ చైర్మన్ చిలుకమ్మ, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు.