ఆసిఫాబాద్, జనవరి8 : విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి నింపాలని జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ని ఆదర్శ క్రీడాపాఠశాల మైదానంలో ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలను జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్రావు, డీటీవో పద్మ, డీడీ రమాదేవితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ అరిగెల సోదరులు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మూడు రోజుల పా టు నిర్వహించే ఈ క్రీడల్లో మొత్తం 136 టీ మ్లు పాల్గొననున్నట్లు ఎంపీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్‌హైమద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గం ధం శ్రీనివాస్, నాయకులు వెంకన్న, గోపాల్‌నాయక్, శంకర్, శ్రీనివాస్, పెంటయ్య, ని జాం, పరీక్షల నిర్వహణాధికారి ఉదయ్బా బు, జిల్లా క్రీడల అధికారి మీనారెడ్డి, పీడీలు, పీఈటీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.