కాగజ్‌నగర్ టౌన్, ఫిబ్రవరి 8 : సిరిసిల్ల, సిద్దిపేట ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు గురువారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే ధ్యేయంగా పని చేయాలని వారు జడ్పీ చైర్మన్‌కు సూచించారు. ఆయన వెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సంజయ్‌సింగ్ ఠాకూర్ ఉన్నారు.