చింతలమానేపల్లి : మంచిర్యాల జిల్లా చింతలమానేపల్లి మండలంలోని డబ్బా గ్రామంలో శనివారం ఎస్ఆర్ఎస్ (SRS) యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం చలివేంద్రాలు ప్రారంభించారు. డబ్బాఎక్స్ రోడ్ ,బారెగూడ మహాత్మ జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ఎస్సై ఇస్లావత్ నరేష్ (SI Islawat Naresh) , ఎంపీడీవో సుధాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు సేవాగుణం కలిగి ఉండాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ అంకితభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. చలివేంద్రాలను ఏర్పాటుచేసిన యూత్ సభ్యులను అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు గుర్లె శ్రీనివాస్, కావుడే సాయి కిరణ్, గుర్లే విలాస్, కొట్రంగి తిరుపతి, నాగరాజ్, మోహన్, వసంత్, రజిత నారాయణ, నాయకులు దుర్గం విజయ్, నికోడే శ్రీనివాస్, భిక్షపతి,బోజయ్య ,శంకర్, తిరుపతి గౌడ్, ధోని లింగయ్య, శంకర్, అశోక్, శేఖర్, రామయ్య, చంద్రు తదితరులు పాల్గొన్నారు.